ఆందోళనలో అభిమానులు.. ధైర్యం చెబుతున్న పవన్

Published on Apr 16, 2021 7:39 pm IST

కొన్నిరోజుల క్రితం సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. మొదట్లో చేసిన పరీక్షల్లో నెగెటివ్ అని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ రెండు రోజుల క్రితం జరిపిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. తిరుపతి పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్‌కు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. జ్వరం, ఒళ్లునొప్పులు, ఊపిరితిత్తుల్లో నెమ్ము లాంటివి ఉండటంతో ఆయన క్వారంటైన్ తీసుకున్నారు. ఇక తాజాగా పాజిటివ్ రావడంతో ఆయన అభిమానులు కంగారుపడుతున్నారు.

ఖమ్మంకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ తంగెళ్ల సుమన్ పవన్ కళ్యాణ్‌కు చికిత్స అందిస్తున్నారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ మొదలగు కుటుంబ సభ్యులు పవన్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ కావాల్సిన అన్ని రకాల వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. అపోలో నుండి ఒక ప్రత్యేక వైద్య బృందం కూడ పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు కరోనా సోకినా సంగతి తెలియడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పవన్ తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని ధీమాగా చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :