నితిన్ కోరికను పవన్ కళ్యాణ్ మన్నిస్తాడా..?

నితిన్ కోరికను పవన్ కళ్యాణ్ మన్నిస్తాడా..?

Published on Nov 17, 2014 7:51 PM IST

Chinnadana-Neekosam
ప్రేమకధా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో యువ హీరో నితిన్ నటించిన చిత్రం ‘చిన్నదాన నీకోసం’. మిస్తీ చక్రవర్తి కధానాయిక. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ చిత్ర ఆడియోను నవంబర్ 27న విడుదల చేస్తున్నారు. ఆడియో విడుదల కార్యక్రమానికి తన అభిమాన హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధిగా తీసుకురావడానికి నితిన్ ప్రయత్నిస్తున్నారు అని ఫిల్మ్ నగర్ సమాచారం. మరి, నితిన్ కోరికను పవన్ మన్నిస్తాడో..? లేదో..? వేచి చూడాలి.

‘ఇష్క్’ చిత్ర ఆడియోను పవన్ విడుదల చేశారు. తర్వాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో పవన్ సాంగ్ రీమిక్స్ చేశారు. ఆ చిత్రాలు ఘనవిజయం సాధించింది. నితిన్ కు పవన్ సెంటిమెంట్ కలిసొచ్చింది. ‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ సెంటిమెంట్ ఎలా కొనసాగించారో..? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నితిన్ సోదరి నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 19న ‘చిన్నదాన నీకోసం’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు