ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజాకధనాల ప్రకారం పవన్ కళ్యాణ్ మరోసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వ భాద్యతలు చేపట్టనున్నాడు. దాసరి నిర్మించనున్న సినిమాకు తానే డైరెక్టర్ అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తుంది. ‘జానీ’ సినిమా ఘోర పరాజయం తరువాత దర్శకత్వం జోలికి పవన్ వెళ్ళలేదు. అయినా తనకు సినిమా డైరెక్ట్ చెయ్యాలని వుందనే కోరికని పలుమార్లు బయటపెట్టాడు. ఆ మధ్య ‘సత్యాగ్రహి’ అనే ప్రాజెక్ట్ ప్రారంభించినా అది కార్యరూపం దాల్చలేదు.
పవన్ కళ్యాణ్ కి సినిమాలో అన్ని రంగాలలో బాగానే పట్టు వుంది. గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్ వర్క్ లలో సైతం పాల్గున్నాడు. ఈ సినిమా ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్ధంగా వుంది. గబ్బర్ సింగ్ 2 తరువాత పవన్ – దాసరిల సినిమా మొదలయ్యే సూచనలు వున్నాయి.


