చరణ్ సినిమాకి బాబాయ్ స్పెషల్ బ్లెస్సింగ్స్.. పవర్ఫుల్ వీడియో చూసారా!

చరణ్ సినిమాకి బాబాయ్ స్పెషల్ బ్లెస్సింగ్స్.. పవర్ఫుల్ వీడియో చూసారా!

Published on Jun 3, 2026 11:08 AM IST

ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం రామ్ చరణ్ నటించిన పెద్ది కోసం అందరికీ తెలిసిందే. మెగాపవర్ స్టార్ ఒక సెన్సేషనల్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కొట్టాలని అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే రామ్ చరణ్ హిట్ కొట్టాలని లేటెస్ట్ గా తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన వీడియో డిజైన్ చేయించి మరీ చరణ్ హిట్ కొట్టాలని తన ఆశీస్సులు అందించారు. రామ్ చరణ్ అంటేనే హనుమంతుడు అంశ అని మెగా అభిమానులు భావిస్తారు. తన ఠీవి, ఆకృతి ఆంజనేయుని మరిపించేలా ఉంటాయని చాలా మందే అంటారు.

అలా మెగాస్టార్ చిరంజీవి కూడా ఏమనుకొని రామ్ చరణ్ అని పేరు పెట్టారో అందుకు తగ్గట్టుగానే చరణ్ అందరినీ ఆశ్చర్యపరచగా ఇపుడు అదే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు చరణ్ పై, పెద్ది సినిమాపై ఉండాలని సినిమా అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పై డిజైన్ చేయించిన ప్రత్యేకమైన ఎడిట్ కట్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సహాన్ని నింపింది.

రామ్ చరణ్ అన్ని సినిమాల కట్స్ తో క్రేజీ ఎడిట్ అందులో చరణ్ పోశ్చర్స్ కి హనుమంతుని రిఫరెన్స్ లతో ఓ రేంజ్ లో అనిపించేలా కనిపిస్తుంది. దీనితో రామ్ చరణ్ అభిమానులు బాబాయ్ ప్రేమను చూసి మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు