‘శంకరాభరణం’ టీమ్‌కు పనన్ బెస్ట్ విషెస్!

Pawan-Kalyan-and-Kona-venka
హ్యాట్రిక్ హీరో నిఖిల్, స్టార్ రైటర్ కోన వెంకట్ కాంబినేషన్‌లో ‘శంకరాభరణం’ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! బీహార్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ కామెడీ సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లేలను సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఉదయ్ నందనవనం అనే కొత్త దర్శకుడు వెండితెరకు పరిచయం కానున్నారు. నిన్నే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. నార్త్ ఇండియాలో కథకు సరిపడే లొకేషన్లలో షూటింగ్ జరగనుంది.

కాగా కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూరుస్తూ, నిర్మిస్తున్న సినిమా నిన్న సెట్స్‌పైకి వెళ్ళిన సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ విషయాన్ని కోన వెంకట్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “శంకరాభరణం సినిమాకు పవన్ కళ్యాణ్ తన బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలతో మొదలుపెట్టడం చాలా బాగుంది” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు నిర్మాత కాగా నిఖిల్ సరసన హీరోయిన్‌గా నందిత నటిస్తోంది.

Exit mobile version