వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ కుమార్తె, చేగువేరా ఫోటో !
Published on Jul 8, 2018 11:31 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేగువేరా పై తనకున్న ప్రేమను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఐతే ఈ సారి తన కుమార్తె రష్యా దేశస్థురాలైన అన్నాలెజినోవాకు పుట్టిన అమ్మాయి పొలీనా అంజనీ ఫోటోతో పోలుస్తూ ట్వీట్ చేశారు ‘నేను చెగువేరా జీవితం నుంచి నేర్చుకుంది ముఖ్యంగా ‘ప్రపంచంలో అరాచకం, దోపిడి, నిరంకుశత్వం ఉన్న వ్యవస్థల వల్ల ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నపుడు, నువ్వు ఆ దేశపు మనిషివి కానప్పటికీ, నీకు వ్యక్తిగతంగా ఏమీ జరగనప్పటికీ, నువ్వు పెరిగిన దేశపు, సమాజపు హద్దులను చెరిపేసి ప్రపంచ పీడిత ప్రజలకు అండగా నిలబాలి’ అని చెప్పినావాడు, అంతే కాదు జీవితపు అంతిమ క్షణాలు వరకు తాను నమ్మిన సిద్దాంతాన్ని నడిచి చూపించి విశ్వనరుడు ‘చెగువేరా’.

అందుకేనేమో దశాబ్ధాల క్రితం, ఎక్కడో దక్షిణ అమెరికాలో అర్జెంటీనాలో పుట్టి పెరిగి, క్యూబా, ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాలలో పోరాటాలు చేసిన చెగువేరా ఉత్తరాంధ్రలోని ఓ మూలకి విసిరేసినట్టుండే ఇచ్చాపురంలో స్వేచ్ఛామాత గుడికి వెళ్లే విధికి ఎదురుగా ’ ఒక చెప్పుల దుకాణంపైన విశ్వనరుడు చేగువేరా ముఖచిత్రం నాకు దర్శనమిచ్చింది’ అని పవన్ కళ్యాన్ ట్విట్ చేశారు. ఐతే చేగువేరా మైనపు విగ్రహం పక్కన నిలబడి… తన కుమార్తె పొలీనా అంజనీ దిగిన ఫొటోను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు. కాగా ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పవర్ స్టార్ అభిమానులు అంజనీ ఫోటోను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook