నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ రోజు అంతా ఆయనకు, మెగా అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా చిరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తన ఆన్నయ్య మెగాస్టార్ ను స్వయంగా కలిసి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
అయితే పవన్ కళ్యాణ్ తన కుటుంబ సమేతంగా చిరంజీవి ఇంటికి వచ్చి మరి శుభాకాంక్షలు తచెప్పటం విశేషం. మెగాస్టార్ పుట్టిన రోజు వేడుక కానుకగా వదిలిన సైరా టీజర్ ఇప్పటికే 2 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది.


