పవన్ “వీరమల్లు”లో “వకీల్ సాబ్” తరహా షేడ్స్.?

Published on May 25, 2021 2:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో భారీ అంచనాలు సెట్ చేసుకున్న పాన్ ఇండియన్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి ముందు పవన్ కం బ్యాక్ చిత్రంగా ప్లాన్ చేసిన “వకీల్ సాబ్” రిలీజ్ కి ముందు దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా జరిగాయి.

అయితే పవన్ వకీల్ సాబ్ లో ఎలా అయితే మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించి మెప్పించారో ఇపుడు “హరిహర వీరమల్లు”లో మూడు డిఫరెంట్ లుక్స్ కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో ఆల్రెడీ పవన్ డ్రెస్సింగ్ ముప్పై రకాలుగా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. మరి వాటికి అనుగుణంగా మూడు డిఫరెంట్ లుక్స్ లో పవన్ కనిపించనున్నాడట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :