మంగళవారం ప్రకటించిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ నామినేషన్లలో గత ఏడాది ఘన విజయం సాదించిన సినిమాలకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చారు నిర్వాహకులు. అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిర్చి, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు అవార్డు నామినేషన్లలో కూడా తమ హవాను కొనసాగించాయి. మేజర్ కేటగిరిలైన ఉత్తమ హీరో, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ హీరోయిన్ విభాగాలలో అన్ని నామినేషన్లను ఈ సినిమాలు కైవసం చేసుకున్నాయి.
ఉత్తమ హీరో విభాగంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, నితిన్, రామ్ చరణ్ లు పోటి పడుతున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా అత్తారింటికి దారేది, మిర్చి సినిమాలకు గాను దేవి రెండు సార్లు నామినేట్ అయ్యారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాదించిన ‘ఉయ్యాలా జంపాలా’కు కూడా ఫిలిం ఫేర్ అవార్డులలో సముచిత ప్రాధాన్యం లభించింది. ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు విభాగాలలో నామినేషన్ పొందింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలలో తమ నటనతో మెప్పించిన అంజలి, నదియా, ప్రణితలు ఉత్తమ సహాయ నటి విభాగంలో పోటి పడుతున్నారు.


