అనారోగ్యంతో ఉన్న అభిమానికి పవన్ ఆర్థిక సాయం

Published on Aug 20, 2019 10:57 pm IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానిని కలిసి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే ఆ అభిమాని త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్ధించారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన తన అభిమానిని కలిశారు.

ప్రకాశం జిల్లా అన్నసముద్రం అనే ఊరికి చెందిన పాతకూటి బూడిగయ్యకు మొదటినుండీ పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. ఆయన సిద్ధాంతాలు ,భావజాలం నట్చిన బూడిగయ్య గత ఎన్నికలలో కూడా జనసేన పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నట్లు సమాచారం. క్యాన్సర్ బారిన పడిన బూడిగయ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన పవన్ ను కలవాలని అడుగగా, పవన్ అతన్ని కలిసి ఆర్థిక సాయం చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :