ఆగష్టు వరకూ ‘పవన్’ నో షూటింగ్ !

ఆగష్టు వరకూ ‘పవన్’ నో షూటింగ్ !

Published on Jun 9, 2020 3:00 AM IST

pawan7

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో సినిమాలు చేస్తున్నారు. అయితే పవన్ ఆగష్టు వరకూ షూట్ చేయకూడదు అని నిర్ణయించుకున్నారట. దాంతో క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఆగష్టు లాస్ట్ వీక్ నుండి షూట్ రెడీ కానున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి షూట్ చేయనున్నారు. ఇక క్రిష్ తో చేస్తోన్న ఈ సినిమా ఒక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక పవర్ స్టార్ వరుస సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ‘పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, అలాగే క్రిష్ సినిమా చేస్తున్న ఆయన వీటి తర్వాత హరీష శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చే ఏడాదికి పూర్తైపోతాయి. పవన్ 2022లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. డాలీ దరకత్వంలో సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2022లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు