నిన్న ‘ఆర్ఆర్ఆర్’ ఈరోజు పవన్ సినిమా

Published on Mar 6, 2021 12:00 am IST

పెద్ద సినిమాలను లీకేజ్ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైనా దగ్గర్నుండి సినిమాకు సంబంధించిన అప్డేట్లు, ఫోటోలు, స్టిల్స్ సులభంగా బయటికొచ్చేస్తున్నాయి. సెట్లో మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక మూల నుండి లీకు వీరులు తమ పని కానిచ్చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎడిటింగ్ టేబుల్ నుండి టీజర్ కట్స్ బయటికొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో అధికారికంగా నిర్మాతలు చెప్పాల్సిన చాలా సంగతులు వారి ప్రమేయం లేకుండానే బయటికొస్తున్నాయి.

నిన్నటికి నిన్న ‘ఆర్ఆర్ఆర్’ నుండి పెద్ద ఎత్తున ఫోటోలు, స్టిల్స్ లీకయ్యాయి. చరణ్, ఎన్టీఆర్ తాలూకు కీలకమైన స్టిల్స్ బయటికొచ్చాయి. సోషల్ మీడియా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యాయి. చివరికి రాజమౌళి టీమ్ కిందా మీదా పడి వాటిని తొలగించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ సినిమా వంతు. పవన్, రానాలు కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన లీక్డ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. కీలకమైన ఫైట్ సన్నివేశంలో స్టిల్ అది. చిత్రంలోని పెద్ద ఫైట్లలో అది కూడ ఒకటి. దీంతో తలపట్టుకుంటున్నారు సినిమా బృందం. ఏదిఏమైనా ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే సినిమా యూనిట్ మరిన్ని కఠిన నిబంధనలు పాటించక తప్పదు.

సంబంధిత సమాచారం :