“వీరమల్లు” పై ఓ రేంజ్ లో పెరుగుతున్న అంచనాలు.!

Published on Apr 15, 2021 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా కోసం మన తెలుగు ఆడియెన్స్ కు సెపరేట్ గా చెప్పనవసరం లేదు. ఒక సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు తన “వకీల్ సాబ్” ప్రూవ్ చేస్తుంది. జస్ట్ ఒక రీమేక్ పైగా ఎక్కువగా కోర్ట్ డ్రామా అయినా కూడా పవన్ మార్క్ వసూళ్లను ఈ చిత్రం రాబడుతుంది. కరోనా అలాగే టికెట్ ధరలు తగ్గించినా పవన్ మాస్ బాటింగ్ మాత్రం అనేక ఏరియాల్లో సాలిడ్ గా ఉంది.

దీనితో ఇక పవన్ నెక్స్ట్ సినిమా అయిన “హరిహర వీరమల్లు” పై అంచనాలు ఓ రేంజ్ లోకి వెళ్తున్నాయి. “వకీల్ సాబ్” దర్శకుడు శ్రీరామ్ వెన్యూ రేంజ్ లో తెరకెక్కిస్తాడని పవన్ ఫ్యాన్స్ అనుకోలేదు. దీనితో ఇప్పుడు వీరమల్లు నుంచి క్రిష్ పై మరింత నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ తో మాంచి కన్నుల పండుగను క్రిష్ ప్లాన్ చేస్తున్నారని అర్ధం అయ్యింది.

మరి ఇప్పుడు వకీల్ సాబ్ లాంటి రీమేక్ సినిమా హిట్ కావడం అందులోని కోవిడ్ లాంటి సమయంలో మంచి వసూళ్లు రాబట్టడంతో ఆ పాన్ ఇండియన్ సినిమా పైగా డైరెక్ట్ సినిమా కావడంతో అది కానీ హిట్ అయితే పవన్ ప్రభంజనం ఖచ్చితంగా మరో స్థాయిలో ఉంటుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి క్రిష్ ఈ చిత్రాన్ని ఏ రకంగా ప్రెజెంట్ చేయనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :