పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ని హీరోకమ్మని ప్రోత్సాహించడమే కాక తన మొదటి సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించాడు. పవన్ ఆశించినట్టుగానే ‘పిల్లా నువ్వులేని జీవితం’ మంచి విజయం సాధించింది. సమాచారం ప్రకారం ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక షో వేసుకుని చూడనున్నాడని సమాచారం.
గోపాల గోపాల సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్ట్ షూటింగ్ ని పూర్తిచేసుకొన్నాడు. సంక్రాంతికి ఈ సినిమా విడుదలకానుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హరీష్ శంకర్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో బిజీగా వున్నాడు


