పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా కొద్దిరోజులు అక్కడే షూటింగ్ జరుపుకునే అవకాశం వుంది. జూన్ నుండి ఈ సినిమా షూటింగ్ యూరోప్ లో నిర్వహించనున్నారని సమాచారం. సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. త్రివిక్రమ్ స్టైల్, కామెడీ, పంచ్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉండనున్నాయి. నదియా, బోమన్ ఇరానీలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలని పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఒక మిస్టరీగా మారింది. ఈ విషయం పై ప్రొడక్షన్ టీం నుండి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఫిల్మ్ చాంబర్ లో ‘అత్తారింటికి దారేది’ అనే పేరు రిజిస్టర్ చేశారని సమాచారం.
రామోజీ ఫిల్మ్ సిటీలో పవన్ – త్రివిక్రమ్ సినిమా
రామోజీ ఫిల్మ్ సిటీలో పవన్ – త్రివిక్రమ్ సినిమా
Published on May 2, 2013 4:56 PM IST
సంబంధిత సమాచారం
- టాక్సిక్ : స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి.. అక్కడ టికెట్ రేటు ఎంతంటే..?
- రేపే ‘టాక్సిక్’ విడుదల: ఏపీ, తెలంగాణల్లో మొదలైన బుకింగ్స్.. తొలి షో ఎప్పుడంటే?
- అఫీషియల్: నైజాంలో ‘టాక్సిక్’కి టికెట్ ధరల పెంపు.. డీటెయిల్స్ ఇవే!
- ‘ప్యారడైజ్’ కొత్త సాంగ్ పై లేటెస్ట్ అప్డేట్.. ఆయా షేర్ కాంబినేషన్లో మరో మ్యాడ్ నెంబర్
- ‘మహాకాళి’: ‘హను మాన్’ మ్యాజిక్ రిపీట్ చేసిన ప్రశాంత్ వర్మ..!
- ‘ఇరుముడి’ బాక్సాఫీస్ రికార్డులు: 4 రోజుల్లోనే 38 లక్షల టికెట్లు.. రూ.100 కోట్ల క్లబ్, ‘బాహుబలి 2’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆక్యుపెన్సీ
- కియారాకి మరో ప్లాప్ మిస్.. తన సినిమాని తానే ట్రోల్ చేసుకున్న నయన్ భర్త!
- కొన్ని గంటలే ఉన్నా తెరుచుకోని ‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్!
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: 3 రోజుల్లోనే రూ.30 కోట్ల షేర్ వసూళ్లు!
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- ‘రాకా’లోకి మరో భామ రాక.. ఎవరంటే..?
- NBK111 కోసం రెండు టైటిల్స్..?
- మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న కొరటాల ?


