ఇప్పుడిప్పుడే మల్టీ స్టారర్ సినిమాలు మళ్ళీ టాలీవుడ్ లో మొదలవుతున్న తరుణంలో టాలీవుడ్ టాప్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి ఓ సినిమా చేయడానికి శ్రీ కారం చుట్టారు. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్.
చాలా రోజుల క్రితం ఈ సినిమా లాంచనంగా ప్రారంభమైనప్పటికీ వెంకటేష్ ‘దృశ్యం’ సినిమా రీమేక్ లో బిజీగా ఉన్నాడు. అలాగే పవంకల్యాన్ ఏమో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా మే 19 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ముందుగా వెంకటేష్ తో షూటింగ్ మొదలు పెడతారు. ఆ తర్వాత జూన్ లో పవన్ కళ్యాణ్ ఈ చిత్ర టీంతో జాయిన్ అవుతారు.
ఈ సినిమా కోసం రామానాయుడు సినీ విలేజ్ లో ఓ ప్రత్యేక సెట్ ని ఏర్పాటు చేసారు. డి.సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి డాలీ దర్శకత్వం వహించే అవకాశం ఉంది.


