“వీరమల్లు” యాక్షన్ లో..వింటేజ్ కళ్యాణ్.!

Published on Apr 2, 2021 4:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. మొన్నీమధ్య వచ్చిన గ్లింప్స్ కు అన్ని వర్గాలు సహా ఇతర హీరోల అభిమానుల నుంచి కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

మరి దీనితో పాటుగా ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఓ రేంజ్ లో ఉండనుంది అన్న సంగతి ఆ మధ్యన విన్నాం. మరి అది ఏ రేంజ్ లో ఉండబోతుందో మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను వదిలారు. తన షావోలిన్ మాంక్ ట్రైనర్ తో బళ్ళెం పట్టుకుని వీరమల్లు సెట్స్ లో పవన్ కసరత్తులు చేస్తూ ఇందులో కనిపిస్తున్నారు.

ఇవి చూస్తే పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ గ్యారంటీ అనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో పవన్ లుక్స్ ను చూస్తే పాత రోజులు గుర్తుకు రాక మానవు. మరి సినిమాలో కూడా ఇలాగే ఉంటే వింటేజ్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. మొత్తానికి మాత్రం యాక్షన్ పార్ట్ ను క్రిష్ చాలా కేర్ తీసుకొని పవన్ లోని మార్షల్ కళను గట్టిగానే వాడుతున్నారని చెప్పాలి.

ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :