పవర్ స్టార్ రీస్టార్ట్ చేసేది అప్పుడేనా.?

Published on Jun 5, 2021 6:00 pm IST

దాదాపు మూడున్నరేళ్లు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పైకి “వకీల్ సాబ్” అనే బ్లాస్ట్ తో రీఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే మరో బెస్ట్ చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. అయితే పవన్ రీఎంట్రీ ఒక్క ఈ సినిమాతోనే కాకుండా ఇది ఇంకా లైన్ లో ఉండగానే ఎప్పుడు లేని మాస్ స్పీడ్ తో దాదాపు నాలుగు సినిమాలు ఓకే చేసేసారు.

మరి వాటిలో ప్రస్తుతం ఆల్రెడీ సెట్స్ మీద రెండు చిత్రాలు ఉన్నాయి. అవే క్రిష్ తో చేస్తున్న “హరిహర వీరమల్లు” అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కె చంద్ర తో “అయ్యప్పణం కోషియమ్” రీమేక్ చిత్రాలు ఉన్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ మూలాన పైగా పవన్ కి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఈ షూట్స్ అన్నిటికీ బ్రేక్ ఇచ్చేసారు.

మరి ఈ చిత్రాల షూట్ కు గాను ఏకకాలంలో వచ్చే జులై చివరి నుంచి కానీ ఆగష్టు నుంచి కానీ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ వీరమల్లు సినిమా 50 శాతం పూర్తయ్యింది. అయ్యప్పణం రీమేక్ కూడా ఆల్ మోస్ట్ అంతే అయ్యింది. మరి ఈ రెండు చిత్రాల షూట్స్ లో ఏకకాలంలో పాల్గొని పవన్ ఏది మొదట ముగిస్తారో ఏది మొదట విడుదల చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :