రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన పవన్ ‘జనసేన’

రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన పవన్ ‘జనసేన’

Published on Oct 29, 2015 8:30 AM IST

Pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇరు రాష్ట్రాల్లో ఈ పేరుకి ఒక ప్రత్యేక క్రేజ్ ఉంది.. సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అభిమానులు పవన్ కళ్యాణ్ ని హీరోగానే కాకుండా మానవతా విలువున్న వ్యక్తిగా కూడా ఎక్కువ గౌరవిస్తారు. సినిమాలు చేస్తూనే ప్రజలకు సేవ చేయాలని, ప్రజల తరపున న్యాయం కోసం పోరాడటానికి స్థాపించిన పార్టీనే ‘జనసేన’. గత ఎన్నికల కంటే ముందు ఈ జనసేన పార్టీని స్థాపించినా తన పార్టీ ద్వారా ఓట్లు చీలిపోకూడదని బిజెపి, టిడిపి పార్టీలకు సపోర్ట్ గా నిలిచాడు.

ఇప్పటి వరకూ ఎలాంటి ఎలక్షన్స్ లో పోటీ చేయని జనసేన పార్టీని రాజకీయ పార్టీగా మార్చాలని భావించిన పవన్ కళ్యాణ్.. వారం రోజుల క్రితం రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం స్టేట్ ఎలక్షన్ కమీషన్ కి అప్లై చేసాడు. వారం రోజుల పాటు అన్నీ పరిశీలించిన ఎలక్షన్ కమీషన్ వారు జనసేన పార్టీని అధికారిక రాజకీయ పార్టీగా రిజిష్ట్రేషన్ చేసి ఎలక్షన్ కమీషన్ అనౌన్స్ చేసింది. దీనితో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణలో రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. దీనితో మరో రెండు నెలల్లో రాబోతున్న స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి దిగే అవకాశం కనిపిస్తోందని సమచారం. పవన్ కళ్యాణ్ కూడా ఆ ఎన్నికలకు తగినట్టుగానే వ్యూహరచనని సిద్దం చేస్తున్నాడని సమాచారం. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

తాజా వార్తలు