పవన్ నుండి ఫస్ట్ సాంగా..మరి టైటిల్, ఫస్ట్ లుక్ ..?

Published on Feb 28, 2020 9:00 pm IST

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ పింక్ రీమేక్ షూటింగ్ శరవేగంగా నడుస్తుంది. మే నెలలో వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో షూటింగ్ చివరి దశకు చేరిందని సమాచారం. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటిసారి పింక్ రీమేక్ లో లాయర్ రోల్ చేస్తున్నారు.

కాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ కొద్దిరోజులలో విడుదల కానుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు థమన్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ పాటల కోసం చాల కష్టపడుతున్నాను అని ఆయన చెప్పుకొస్తున్నారు. ఐతే మూవీ టైటిల్ ఇంత వరకు ప్రకటించలేదు. లాయర్ సాబ్, వకీల్ సాబ్ అంటూ రెండు మూడు టైటిల్స్ వినపడుతున్నప్పటికీ ఏదీ అధికారికంగా నిర్ణయించలేదు. అలాగే ఆయన పవన్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. పవన్ దర్శక నిర్మాతలు ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటించకుండానే సాంగ్ విడుదల చేస్తారా అని డౌట్ కొడుతుంది.

సంబంధిత సమాచారం :