బోల్డ్ హీరోయిన్ కాప్ గా ఇరగదీయనుందట..!

Published on Mar 1, 2020 11:11 am IST

జయాపజయాలతో సంబంధం లేకుండా యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి చిత్రంలోనే హాట్ అటెమ్ట్ చేసింది. ఇక ఈ మధ్య వచ్చిన ఆర్ డి ఎక్స్ లవ్ మూవీలో కూడా పాయల్ మంచి గ్లామర్ రోల్ చేయడం జరిగింది. ఆ చిత్రంలో ఆమె ప్రధాన నటి కాగా మరో చిత్రం ఆమె ప్రధానంగా తెరకెక్కుతుంది.

గుణశేఖర్ దగ్గర పనిచేసిన ప్రాణదీప్ అనే దర్శకుడు పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ ఐ పి ఎస్ అధికారిణిగా నటిస్తున్నారట. ఈ మూవీలోని ఆమె ఫస్ట్ లుక్ ఈనెల 4న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More