‘పాయల్ రాజ్ పుత్’ పై అది రూమర్ అట !

Published on Jan 25, 2021 10:54 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ లో హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించబోతుందని గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి, కాగా చిత్రబృందం నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో పాయల్ నటించట్లేదు. ఇక ఈ సినిమాలో శ‌ర్వానంద్ కి జ‌త‌గా అదితి రావు హైదరి నటించబోతుంది.

కాగా సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి తదితరులు నటిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం :