మాస్ రాజా సరసన ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ !

Published on Oct 31, 2018 12:12 pm IST

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈసినిమా తరువాత ఆచి తూచి సినిమాలకు ఎంచుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా ఆమె మరో చిత్రానికి సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

విఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ నటించనున్న చిత్రంలో పాయల్ ఒక హీరోయిన్ గా ఎంపికైయింది. ముగ్గురు హీరోయిన్లుకు ప్రాధాన్యం వున్న ఈచిత్రంలో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నాబా నటేష్ ను మరొక హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక ఈచిత్రం డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. రవితేజ డ్యూయెల్ రోల్ లో నటించనున్న ఈచిత్రంలో సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :