లతా మంగేష్కర్ కి పిబి శ్రీనివాస్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

లతా మంగేష్కర్ కి పిబి శ్రీనివాస్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

Published on Jan 15, 2015 2:29 PM IST

latha-mangeshwar

నైటింగేల్ అఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న లెజెండ్ సింగర్ లతా మంగేష్కర్. ఎన్నో అవార్డులను అందుకున్న ఆమెకి త్వరలో మరో అరుదైన అవార్డును ఇచ్చి సత్కరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రతిష్టాత్మక పిబి శ్రీనివాస్ మెమోరియల్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును సంగీత ప్రపంచంలో ఎన్నో సేవలు అందించిన లతా మంగేష్కర్ కు ఇవ్వనున్నారు. పిబి శ్రీనివాస్ ఫ్యామిలీ వారు ఇచ్చే ఆ అవార్డును కలసుధ ట్రస్ట్ వారు అందజేయనున్నారు.

ఈ అవార్డును మరో లెజండ్రీ సింగర్ అయిన ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా లతా మంగేష్కర్ కి ఈ అవార్డును అందజేయనున్నారు. లతా మంగేష్కర్ తో కలిసి పాడిన మొట్ట మొదటి తెలుగు సింగర్ పిబి శ్రీనివాస్. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ పిబి శ్రీనివాస్ తో ఉన్న తన అనుబంధాన్ని గురించి గుర్తు చేసుకోవడమే కాకుండా, ఈ అవార్డు ఆమెకి రావడం ఆనందంగా ఉందని అన్నారు.

తాజా వార్తలు