టీజర్ టాక్..కాస్త ఆసక్తిగా ఉన్న “పీనట్ డైమండ్”.!

Published on Mar 20, 2021 4:01 pm IST

మన ఇండియన్ సినిమాలో టైం ట్రావెల్ లేదా టైం లైన్ కాన్సెప్ట్ పై చాలా తక్కువ సినిమాలే వచ్చాయి. మరి కొన్ని రోజుల కితమే “ప్లే బ్యాక్” అనే క్రాస్ టైం లైన్ సినిమా వచ్చింది. మరి ఇప్పుడు “పీనట్ డైమండ్” అనే మరో సినిమా రెండు టైం లైన్స్ తో వస్తుంది. మరి ఈ చిత్రం తాలూకా టీజర్ ను మేకర్స్ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఇప్పుడు విడుదల చేసారు.

మరి ఈ టీజర్ ను చూస్తే టైటిల్ లో పెట్టినట్టుగానే డైమండ్స్ ప్రధాన పాత్ర ఇస్తూ చూపించిన కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది అలాగే మెయిన్ లీడ్ లో కనిపించిన అభినవ్ సర్దార్ సాలిడ్ పర్సనాలిటీతో స్టన్నింగ్ ఉన్నాడు. అలాగే రామ్ కార్తీక్ కూడా బాగున్నాడు. మరి ఈ ఇద్దరికీ కామన్ గా చూపిన పాయింట్ ఈ టీజర్ లో ఆసక్తి రేపింది. అలాగే ఇదే డైమండ్స్ పై మెయిన్ లీడ్ ఎలాంటి కొత్త స్టెప్ తీసుకోబోతున్నాడు అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఇక ఫిమేల్ లీడ్స్ చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌ లు బాగా కనిపించారు. మరి భీమ్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ లో బాగుంది. జె ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన సినిమాటోగ్రఫీ ఈ కాన్సెప్ట్ సినిమాకు కరెక్ట్ గా ఉంది. ఫైనల్ గా క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్న వెంక‌టేష్ త్రిప‌ర్ణ ఫుల్ లెంగ్త్ లో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :