మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పెద్ది” ఇప్పుడు బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో ప్రీమియర్స్, ప్రీ సేల్స్ ని వరల్డ్ వైడ్ గా సెట్ చేసుకుంది. అయితే యూఎస్ మార్కెట్ లో కూడా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు మరో మార్క్ ని అక్కడ దాటేసింది.
నార్త్ అమెరికా ప్రాంతంలో పెద్ది ఇప్పుడు 2.2 మిలియన్ మార్క్ ని దాటి నెక్స్ట్ ఈజీగా 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ దగ్గరకి వెళ్ళిపోతుంది. అలాగే లాంగ్ రన్ కూడా సాలిడ్ గా ఉండేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో జగపతిబాబు, దివ్యెందు, రావు రమేష్ అలాగే ఉపేందర్ లిమాయే తదితరులు నటించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకి రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.
#PEDDI Keeps The Celebration Going 🧨
North America Gross $2.2 MILLION and Counting 💪 🔥#BlockbusterPEDDI In Cinemas Now, North America By @PrathyangiraUS💥@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @vriddhicinemas @venkataskilaru… pic.twitter.com/zs7dMTy37N
— Prathyangira Cinemas (@PrathyangiraUS) June 6, 2026


