గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా ఈ సినిమా తన థియేట్రికల్ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం, విడుదలైన రెండో శనివారం నాటికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 378 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అలాగే, ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా మరియు 2026లో నంబర్ 1 చిత్రంగా ‘పెద్ది’ నిలిచిందని మేకర్స్ పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. అన్నట్టు ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ సంస్థ రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ తదితరలు కీలక పాత్రలు పోషించారు.



