మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం.. కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల మార్క్‌ను దాటి సరికొత్త ప్రభంజనం సృష్టించిందని సినీ సర్కిల్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని ప్రాంతాలలోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో మరియు మాస్ మేనరిజమ్స్‌తో మరోసారి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని క్రేజ్‌ను, కలెక్షన్ల పవర్‌ను నిరూపించుకున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న విజయం పట్ల మెగా అభిమానులు దేశవ్యాప్తంగా పండుగ చేసుకుంటున్నారు.


