యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ డామినేషన్.. ఏకంగా 3 మిలియన్ మార్క్ క్రాస్..!

యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ డామినేషన్.. ఏకంగా 3 మిలియన్ మార్క్ క్రాస్..!

Published on Jun 9, 2026 5:57 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే పలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.

ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతూ ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. అక్కడ ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణను బట్టి కలెక్షన్లు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్స్ సంతోషం వ్యక్తం చేస్తుననారు. ఇక ఈ సినిమాను చూసేందుకు వర్కింగ్ డేస్‌లోనూ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు క్యూ కడుతుండటం విశేషం.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు