ఇది కదా కావాల్సిన మూమెంట్.. ‘పెద్ది’ కోసం ఎం ఎస్ ధోని?

ఇది కదా కావాల్సిన మూమెంట్.. ‘పెద్ది’ కోసం ఎం ఎస్ ధోని?

Published on May 9, 2026 7:07 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన అవైటెడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా సినిమానే పెద్ది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ అంతగా జరగడం లేదు అనేది అభిమానులుని బాగా ఇబ్బంది పెడుతుంది. కానీ దీనికి సమాధానంగా మేకర్స్ ఊహించని ట్రీట్ ని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. నార్త్ మార్కెట్ ప్రధానంగా భారీ లెవెల్లో సినిమాని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగా మేకర్స్ మైండ్ బ్లాకింగ్ ప్లాన్ తో వస్తున్నట్టు తెలుస్తోంది.

రాంచీ ప్రాంతంలో ఓ ఈవెంట్ ని మేకర్స్ ప్లాన్ చేయాలని చూస్తుండగా ఈ ఈవెంట్ కోసం క్రికెట్ సెన్సేషన్ ఎం ఎస్ ధోనిని ఆహ్వానించాలని వారు చూస్తున్నట్టు షాకింగ్ బజ్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది సంప్రదింపులు వరకే ఉందట. ఇంకా ఫైనల్ కావాల్సి ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సినిమా ప్రమోషన్స్ ఒక బిగ్గెస్ట్ స్టెప్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా ఎలాగో క్రికెట్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది కాబట్టి ధోనీ వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు