‘పెద్ది’ బిగ్గెస్ట్ ఈవెంట్.. జరిగేది ఎక్కడంటే..?

‘పెద్ది’ బిగ్గెస్ట్ ఈవెంట్.. జరిగేది ఎక్కడంటే..?

Published on May 29, 2026 4:01 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించగా, ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని నార్త్, సౌత్ ఇండియాలో భారీగా ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ ప్రమోషన్స్‌లో భాగంగా జూన్ 1వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ ఈవెంట్‌ను నిర్వహించేందుకు పెద్ది టీమ్ ప్లాన్ చేస్తుంది. ఈ వేడుకకు ‘పెద్ది’ చిత్ర యూనిట్‌తో పాటు పలువురు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు హాజరుకానున్నారట. ఈ ఈవెంట్ అనుమతుల కోసం మేకర్స్ ఇప్పటికే దరఖాస్తు కూడా చేసినట్లు తెలుస్తోంది.

భోపాల్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ తర్వాత విజయవాడలో అంతకంటే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. మరి ఈ బిగ్గెస్ట్ ఈవెంట్‌తో పెద్ది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు