మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ డ్రామానే పెద్ది. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నేడు థలా బుచ్చిబాబు సానా పుట్టినరోజు కానుకగా మేకర్స్ ఓ స్పెషల్ మేకింగ్ వీడియోని అయితే వదిలారు.
ఇక ఈ వీడియోతో పాటుగా కొన్ని ఆన్ లొకేషన్ ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. వీటిలో రామ్ చరణ్ తో పవర్ ఫుల్ పోశ్చర్స్ లో బుచ్చిబాబు కూడా కనిపిస్తుండగా మేకర్స్ అయితే ఏ రేంజ్ లో నమ్మకంగా ఉన్నారో ఈ పోస్ట్ తో చెబుతున్నారు. ఈ ఏప్రిల్ 30 న ‘దూల తీర్చి ధూపం వేసే రోజు’ అంటూ కొంచెం పచ్చిగా, నాటుగానే చెబుతున్నారు.
సో ఈ 30 వ తేదీని మాత్రం అభిమానులు, ఆడియెన్స్ మార్క్ చేసుకుంటే ఆరోజు పాన్ ఇండియా లెవెల్ ఎలాంటి రచ్చ చేసి చూపిస్తారో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
దూల తీర్చి… ధూపం వేసే రోజు
30.04.2026 – #PEDDI 🔥#DhoolaTheerchiDhupamEsthunnam pic.twitter.com/E3HGsuB5FX— PEDDI (@PeddiMovieOffl) February 15, 2026
