ఆ ఫార్మాట్‌లో కూడా పెద్ది విధ్వంసం.. చూడటానికి ఆడియన్స్ రెడీ..!

ఆ ఫార్మాట్‌లో కూడా పెద్ది విధ్వంసం.. చూడటానికి ఆడియన్స్ రెడీ..!

Published on Jun 1, 2026 4:58 PM IST

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను 1980ల నాటి గ్రామీణ ఆంధ్రా నేపథ్యంలో, సమాజంలోని అణిచివేతపై క్రీడల ద్వారా ఒక యువకుడు చేసిన పోరాటంగా అత్యద్భుతంగా మలిచారు మేకర్స్. ఇక ఈ సినిమాలో చరణ్ మాస్ అప్పియరెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది.

కాగా ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ చిత్రంలోని గ్రాండ్ విజువల్స్‌ను పూర్తిగా ఆస్వాదించేలా ఈ మూవీని ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమాను ఐమ్యాక్స్ స్క్రీన్‌లో వీక్షించేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు