గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో సొంతంగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయంతో తమ ప్రాజెక్ట్ పై వారికి ఉన్న నమ్మకం ఏంటో తెలుస్తోంది. అన్నట్టు ఈ ప్రాంతంలో థియేటర్ రైట్స్ విలువ ₹63 కోట్ల వరకు ఉంది. అయితే, టికెట్ ధరలు పెంచకపోతే పరిస్థితి ఏంటి అనేది చూడాలి.
ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ‘ఫస్ట్ గ్లింప్స్’, సాంగ్స్ తో మేకర్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్టు ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.


