మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. ముఖ్యంగా నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుంచి మొత్తం మూడు రోజులకు గానూ భారీ కలెక్షన్స్ ను వసూళ్లు చేసింది. నైజాం ప్రాంతంలో మూడు రోజుల వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. జీఎస్టీతో కలిపి ఈ సినిమా రూ. 34 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ నెంబర్ చాలా పెద్డది. అన్నట్టు శనివారం కంటే కూడా ఆదివారం బుకింగ్స్ బలంగా ఉన్నాయి. కాబట్టి, వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ సంస్థ రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
మొత్తానికి ‘పెద్ది’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ తదితరలు కీలక పాత్రలు పోషించారు.


