మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదల కంటే ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో లో కేవలం ఒక్క గంటలోనే 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడైన నాలుగో తెలుగు సినిమాగా ‘పెద్ది’ రికార్డు సృష్టించింది. బుకింగ్స్ జోరు ఎంతలా ఉందంటే.. ఒకే గంటలో అత్యధికంగా ఏకంగా 45 వేల టికెట్లు అమ్ముడై ఈ చిత్రం సరికొత్త మైలురాయిని అందుకుంది. 2023లో బుక్‌మైషో అవర్లీ ట్రెండింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. ఈ 40K బెంచ్‌మార్క్‌ను దాటిన చిత్రాల జాబితాలో ‘కల్కి 2898 AD’, ‘సలార్’, ‘పుష్ప 2’ చిత్రాల సరసన ఇప్పుడు ‘పెద్ది’ నిలిచింది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఈ భారీ పాన్-ఇండియా చిత్రం పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.


