తెలుగు స్టేట్స్ ప్రీమియర్స్ లో ర్యాంపాడిస్తున్న ‘పెద్ది’

తెలుగు స్టేట్స్ ప్రీమియర్స్ లో ర్యాంపాడిస్తున్న ‘పెద్ది’

Published on Jun 3, 2026 10:05 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “పెద్ది”. తెలుగు సినీ పరిశ్రమ సహా ఆడియెన్స్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ విజయం ఎంతో కీలకం. అయితే ఈ సినిమాపై అంచనాలు రిలీజ్ నాటికి భారీ లెవెల్లో పెరిగిపోయాయి.

ఇలా తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ బుకింగ్స్ మొదలు కాగా డే 1 సహా ఈ ప్రీమియర్ షోస్ తాలూకా బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో అమ్ముడుపోతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా 600 టికెట్ రేటు పెట్టినా కూడా టికెట్స్ ఇపుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీనితో పెద్ది సినిమా బుకింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ప్రీమియర్స్ లో సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా రేపు జూన్ 4న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.

తాజా వార్తలు