మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన వసూళ్లు, ప్రేక్షకుల నుండి వస్తున్న భారీ రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ ‘పెద్ది థాంక్యూ మీట్’ నిర్వహించింది. ఈ వేడుకలో రామ్ చరణ్ ఎంతో ఆనందంగా, కాస్త భావోద్వేగంగా కనిపించాడు. వీకెండ్ ముగిసి సోమవారం వచ్చినప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్టెడీగా ఉంటూ భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుండటం సినిమా సక్సెస్‌ను చాటిచెబుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ఖేలో ఇండియా’ ఉద్యమం ఆధారంగానే ఈ కథను రూపొందించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాల నుండి అద్భుతమైన క్రీడా ప్రతిభను వెలికితీయడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో క్రీడలు అనేవి కేవలం ఆటలు మాత్రమే కావని, అవి గ్రామాలకు, నగరాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను, భావోద్వేగాలను ఎలా కలుపుతాయో ఈ చిత్రం ద్వారా చూపించాలనుకున్నట్లు వివరించారు.
నిర్మాత మైత్రీ రవి మాట్లాడుతూ.. ‘పెద్ది’ చిత్రం అన్ని సెంటర్లలోనూ బాక్సాఫీస్ సంచలనం సృష్టిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ తన వన్‌మ్యాన్ ఆర్మీ పర్ఫార్మెన్స్‌తో సినిమాను నడిపించారని, ఈ భారీ విజయానికి ఆయనే కారణమని కొనియాడారు. మరో నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆదరించి, నిర్మాతగా తన తొలి సినిమాకే మరపురాని విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


