‘పెద్ది’ రెండు వెర్షన్లూ ‘ధురంధర్’ మేకర్స్ తోనే.!

Peddi

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో విడుదలకి సిద్ధంగా ఉన్న టాలీవుడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న సినిమా ‘పెద్ది’ అనే చెప్పొచ్చు. ఒక రూరల్ అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.

అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ ని మేకర్స్ భారీ ఎత్తున విడుదల చేసేందుకు ధురంధర్ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ తో చేతులు కలిపారు. దీంతో నార్త్ మార్కెట్ లో పెద్ది భారీ విడుదల కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక లేటెస్ట్ అప్డేట్ గా జియో స్టూడియోస్ వారు ఈ సినిమా కేవలం హిందీలోనే కాకుండా తెలుగు వెర్షన్ లో కూడా తామే విడుదల చేస్తున్నట్టుగా అఫీషియల్ అప్డేట్ తో కన్ఫర్మ్ చేశారు.

సో ఈ రెండు వెర్షన్ లలోనూ భారీ ఎత్తున నార్త్ ఇండియా మార్కెట్ లో సినిమా విడుదల కానుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా జూన్ 4న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Exit mobile version