గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’(Peddi). ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, గత కొన్ని రోజులుగా, ఈ చిత్రం విడుదల ఈ ఏడాది మార్చి 27 నుంచి వాయిదా పడనుందని పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక నిర్ధారణ లేనప్పటికీ, ఈ ఊహాగానాలు అభిమానులలో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. దీంతో, వారు ఈ సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర బృందాన్ని స్పష్టత కోరుతున్నారు.
మరి ఒకవేళ ఈ సినిమా విడుదల నిజంగానే వాయిదా పడితే, రిలీజ్ డేట్ ఏ నెలకు పోస్ట్ ఫోన్ అవుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఐతే, ఇప్పటి వరకూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని టాక్. మొత్తానికి బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నమైందట. మరి ‘పెద్ది’ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.


