డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “పెళ్లి సందD”

Published on Jun 22, 2022 5:05 pm IST


కామెడీ, డ్రామా లేదా యాక్షన్ రూపంలో ఉత్తమమైన వినోదాన్ని అందించడమే జీ 5 యొక్క ఏకైక లక్ష్యం. వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్ టు డిజిటల్ విడుదలలు మరియు కొత్త చిత్రాలతో జీ5 ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే RRR, బంగార్రాజు, రౌడీ బాయ్స్, వరుడు కావలెను వంటి పోస్ట్ థియేట్రికల్ విడుదలలతో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు, ZEE5 బ్లాక్ బస్టర్ హిట్ పెళ్లి సందD ని ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది.

రోషన్ మేకా మరియు శ్రీలీల నటించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులు ఎక్కువగా కోరుకునే వాటిలో ఒకటి. జూన్ 24 నుండి ZEE5 లో ఈ చిత్రం ప్రసారం కానుంది. ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు క్రియేటివ్‌గా నాయకత్వం వహించగా, గౌరీ రోణంకి దర్శకత్వం వహించారు. థియేట్రికల్‌గా విడుదలైన ఎనిమిది నెలల తర్వాత పెళ్లి సందD చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధం కావడం తో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :