నాయకుడు ఎన్టీయారే, ఇదిగో ప్రూఫ్ అంటున్న వర్మ

Published on Jun 1, 2019 12:59 pm IST

చంద్రబాబు పై రామ్ గోపాల్ వర్మ సెటైర్ల పర్వము ఇప్పటిలో ముగిసేలా లేదు. టీడీపీ అధికారం కోల్పోయిన మొదటి రోజునుండే ట్విట్టర్ లో టీడీపీ పై ఘాటైన విమర్శలు చేస్తున్న వర్మ గతకొన్ని రోజులుగా చంద్రబాబు సారధ్యంలో టీడీపీ కి మనుగడ లేదని, టీడీపీ బాధ్యతలు తారక్ తీసుకోవాలని వరుస కామెంట్స్ తో సంచలనం రేపుతున్నాడు.
బాలకృష్ణలా కాకుండా టీడీపీ సారధ్య బాధ్యతలు తీసుకొని విజయపథంలో నడిపి నీవు తాత తగ్గ మనవడివి అనిపించుకోవాలి అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసిన వర్మ, నేడు మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆంధ్రులు మొత్తం టీడీపీ కి నాయకుడిగా ఎన్టీఆర్ నే కావాలనుకుంటున్నారు, కావాలంటే ఈ ఆధారం చూడండి అంటూ, ట్విట్టర్ లో తాను నిర్వహించిన పోల్ ఫలితాలను పోస్ట్ చేశాడు.

ఎన్టీఆర్ నేతృత్వం లోని టీడీపీ విజయపథంలో దూసుకుపోతుందని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు 79% మంది అనుకూలంగా స్పందించడం గమనార్హం. దాదాపు 42000 మంది ఈ పోల్ లో పాల్గొని తమ అభిప్రాయం తెలిపారు. ఎన్టీఆర్ పై రాజకీయంగా పలువురు ప్రముఖులు అనేక కామెంట్లు చేస్తున్న ఆయన ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం.

సంబంధిత సమాచారం :

More