‘సిటీమార్’లో హీట్ పెంచుతోన్న పెప్సీ ఆంటీ !

Published on Mar 21, 2021 3:00 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్‌ చేస్తోన్న తాజా సినిమా ‘సిటీమార్’. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీ నుంచి విడుదలైన టైటిల్‌ సాంగ్‌తో పాటు ‘జ్వాలారెడ్డి’పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఆదివారం ఈ సినిమా నుంచి ఐటమ్‌ సాంగ్‌ని విడుదల చేశారు. ‘నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ…’ అంటూ సాగే ఈ పాటను దర్శకుడు సంపత్ నంది రాయడం విశేషం. ఇక ఇ పాటను కీర్తన, శర్మ ఆలపించారు.

అన్నట్టు ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటుందట. అయితే గోపీచంద్ ఎన్నో ఆశలతో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే కసితో బాగా పట్టుదలగా ఉన్నాడు సంపత్ నంది.

సంబంధిత సమాచారం :