బాలీవుడ్ లో పర్ఫెక్ట్ ఇండిపెండెన్స్ డే చిత్రాల విడుదల

Published on Aug 15, 2019 10:17 am IST

బాలీవుడ్ లో నేడు రెండు బడా హీరోల చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ కాగా, జాన్ అబ్రహం నటించిన “బాట్లా హౌస్” చిత్రం మరొకటి. ఐతే ఈ రెండు పర్ఫెక్ట్ ఇండిపెండెన్స్ చిత్రాలు అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఈ రెండు చిత్రాలు భారత దేశానికి సంబంధిచిన రెండు యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కినది.

మిషన్ మంగళ్ చిత్రం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మార్స్ గ్రయం పై ప్రయోగించిన మంగల్యాన్ ఉపగ్రహం విజయగాధ నేపథ్యంలో తెరకెక్కడం జరిగింది. ఈ మిషన్ సక్సెస్ తో ఇండియా అంతరిక్ష పరిశోధనలలో అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరింది. ఈ మిషన్ హెడ్ గా పనిచేసిన రాకేష్ ధావన్ పాత్రలో అక్షయ్ కనిపిస్తుండగా, ఈ ప్రాజెక్ట్ విజయంలో కీలక పాత్ర పోషించిన లేడీ సైంటిస్ట్స్ గా, విద్యా బాలన్,తాప్సి,నిత్యా మీనన్,సోనాక్షి సిన్హా,కీర్తి కొల్హారి నటించారు.

ఇక నేడు విడుదలైన మరొక చిత్రం బాట్లా “హౌస్”. 2008లో ఢిల్లీ లోని బాట్లా హౌస్ ప్రాంతంలో పోలీసులకు, ఇండియన్ ముజాహిద్దీన్ టెర్రరిస్టులకు మధ్య జరిగిన వార్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ టెర్రర్ ఎటాక్ లో మోహన్ చంద్ శర్మ అనే పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. హీరో జాన్ అబ్రహం ఈ మూవీలో డి సి పి సంజీవ్ కుమార్ యాదవ్ గా నటించారు.

సంబంధిత సమాచారం :