విడుదలైన ‘పెసరట్టు’ ఆడియో..!

pesarattu
నందు, నిఖిత నారాయణ జంటగా కత్తి మహేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పెసరట్టు’. రిచ్చేజ్జా మీడియా ఫ్యాక్టరీ, టెంపుల్ టౌన్ టాకీస్ పతాకంపై శ్రీనివాస్ గునిశెట్టి,ఏడుపుగంటి శేషగిరి, సుకుమార్, కిరణ్, స్వప్నరాణి కలసి నిర్మిస్తున్నారు. ఘంటశాల విశ్వనాధ్ సంగీతం అందించారు. రామ్ గోపాల్ వర్మ స్ఫూర్తితో క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం నాడు హైదరాబాద్ పార్క్ హోటల్ లో అతిధుల సమక్షంలో జరిగింది. ముఖ్య అతిధిగా హాజరయిన తమ్మారెడ్డి భరద్వాజ ఆడియోను ఆవిష్కరించి తొలి సిడిని ఎన్ శంకర్ కు అందజేశారు. అనంతరం సినిమా విజయవంతం కావాలని ఆశించారు. కథపై నమ్మకంతో ఈ సినిమాకు పని చేశామని ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మరియు యూనిట్ సభ్యులు తెలిపారు.

Exit mobile version