పీటర్ హెయిన్స్ చూజ్ చేసుకున్న హీరో అతడేనా?

Published on Sep 19, 2019 8:19 pm IST

ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ త్వరలో దర్శకుడిగా మారనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు. పీటర్ హెయిన్స్ స్వతహాగా ఫైట్ మాస్టర్ కావడంతో తన సినిమాలో యాక్షన్ కంటెంట్ భారీగా ఉండేలా చూసుకుంటున్నారట.

అందుకే మంచి ఫిట్నెస్ కలిగి యాక్షన్ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఇష్టపడే హీరోనే తన సినిమా కోసం ఎంచుకున్నారట ఆయన. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా.. అతనే బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆఫీషియల్ కన్ఫర్మేషన్ ఉంటుందని టాక్.

బెల్లంకొండ హీరోగా పరిచయమైన ‘అల్లుడు శీను’ చిత్ర నిర్మాతల్లో బుజ్జి కూడా ఒకరు కావడం, ఆయన బెల్లంకొండకు బంధువు కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

X
More