సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘పేట’ నిన్న విడుదలై మిక్సడ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 37.63కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం. ముఖ్యంగా ఓవర్సిస్ లో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఇక ఈచిత్రానికి కోలీవుడ్ బాక్సాఫిస్ వద్ద విశ్వాసం రూపంలో గట్టి పోటీ ఎదురువుతుంది.
పేట మొదటి రోజు వసూళ్ల వివరాలు :
తమిళనాడు – 12.90 కోట్లు
ఏపీ &తెలంగాణ – 3.50కోట్లు
కర్ణాటక – 3.06 కోట్లు
కేరళ – 1.67 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 1.50కోట్లు
ఓవర్సీస్ – 15కోట్లు
మొత్తం – 37. 63 కోట్లు (గ్రాస్)


