పెట్టా ఆడియో విడుదల తేదీ ఖరారైనట్లే

పెట్టా ఆడియో విడుదల తేదీ ఖరారైనట్లే

Published on Nov 22, 2018 4:10 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘పెట్టా’ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. చెన్నై చిత్ర వర్గాల సమాచారం మేరకు ఈచిత్రం యొక్క ఆడియో డిసెంబర్ 16న విడుదలకానుందట. ఇక డిసెంబర్ 12న రజినీ పుట్టిన రోజున సందర్భంగా ఈచిత్ర టీజర్ ను కానీ లేదా చిత్రంలోని సాంగ్ ను కానీ విడుదలచేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ , త్రిష , విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఇదిలావుంటే రజినీ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘2.0’ నవంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. దాంతో కేవలం నెలన్నర గ్యాప్ తేడాతో తలైవా రెండు చిత్రాలతో అభిమానులను అలరించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు