సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట , తల అజిత్ నటించిన విశ్వాసం చిత్రాలు ఇటీవల విడుదలై పొంగల్ సీజన్ ను పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటున్నాయి. ఈ రెండు చిత్రాలు తమిళ ప్రేక్షకులనుండి పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో కోలీవుడ్ బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా విశ్వాసం తమిళనాడులో సత్తా చాటుతుండగా పేట ఓవర్సీస్ లో అదరగొడుతుంది.
మూడు రోజుల్లో విశ్వాసం తమిళ నాడులో 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రం 19కోట్లను వసూళ్లను సాధించింది. కాగా పేట తమిళనాడు లో మూడు రోజుల్లో 42కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా ప్రపంచ వ్యాప్తంగా 92కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో ఈచిత్రం 30కోట్ల వసూళ్లను రాబట్టింది.


