ఇంటర్నేషనల్ లెవెల్లో ‘సాహో’కు డిమాండ్

ఇంటర్నేషనల్ లెవెల్లో ‘సాహో’కు డిమాండ్

Published on Jun 28, 2019 2:00 AM IST

ఈ ఏడాది విడుదలకానున్న సినిమాల్లో ‘సాహో’ దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అన్ని పరిశ్రమల్లోనూ భారీ అంచనాలున్నాయి. ‘బాహుబలి’ మూలాన విదేశాల్లో సైతం ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ డిమాండ్ మూలానే చిత్ర హక్కులకు మంచి క్రేజ్ ఏర్పడింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ భారీ మొత్తం వెచ్చించి విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని కొనుక్కుంది.

యాష్ రాజ్ ఫిలిమ్స్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని పలు బయటి దేశాలతో సహా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా విడుదలచేయనుంది ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ. దీన్నిబట్టి సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న డిమాండ్ ఎలాంటిదో అర్థమైపోతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఆగష్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్నారు. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుండగా పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు